న్యూజిలాండ్ వైట్ ఐలాండ్‌లోని ఓ అగ్ని పర్వతం పేలిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడగా.. పలువురి ఆచూకీ గల్లంతైంది. అగ్నిపర్వత విస్ఫోటనంతో పొగ, దుమ్ము, ధూళి కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తున్నాయి.
అగ్నిపర్వత విస్ఫోటనంపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ స్పందించారు. ఘటనాస్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సమీప ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.