తెలంగాణ

telangana

ETV Bharat / international

పాక్​ విమాన ప్రమాదం: 57 మృతదేహాలే స్వాధీనం! - etv pakisthan flght crash live updates

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాకిస్థాన్​ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఈఘటనలో 57 మంది మృతదేహాలు లభ్యమవగా.. ఎంత మంది చనిపోయారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

45 dead as Pakistan plane with 107 on board crashes in residential area in Karachi
పాక్​లో విమాన ప్రమాదంలో 37 మంది మృతి

By

Published : May 22, 2020, 9:41 PM IST

Updated : May 22, 2020, 11:37 PM IST

పాకిస్థాన్​ కరాచీలో జరిగిన విమాన ప్రమాదంలో.. 57 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమైనట్లు వెల్లడించారు అధికారులు. పాక్​ అంతర్జాతీయ ఎయిర్​లైన్స్​(పీఐఏ)కు చెందిన ఏ-320 విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది. జిన్నా అంతర్జాతీయ విమానాశ్రమం సమీపంలోని నివాస ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పాక్​ సైన్యం, వైమానిక దళాలు.. సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

లాహోర్​ నుంచి వస్తోన్న ఈ విమానం కరాచీ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. కానీ ల్యాండింగ్​కు కొద్ది నిమిషాలకు ముందు నేలకొరిగింది. తొలుత ప్రమాదంలో 100మందికి పైగా మరణించినట్లు అధికారులు భావించారు. అయితే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

విమాన శకలం

నివాస స్థలాలపై విమానం కూలిపోవడం వల్ల.. సుమారు 30 మంది స్థానికులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారందరిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. శిథిలాలను తొలగించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారు.

దర్యాప్తు చేపట్టాలి...

ఈ దుర్ఘటనపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాదంపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

సహాయక చర్యలు

మోదీ, రాహుల్​ ట్వీట్లు​..

ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్​ చేశారు. ప్రమాద వార్త మనసును కలచివేసిందని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు. కరాచీ విమాన ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

విమాన ప్రమాదం దృశ్యాలు
Last Updated : May 22, 2020, 11:37 PM IST

ABOUT THE AUTHOR

...view details