రష్యాలో ఓ విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. మాస్కో విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా విమానంలో భారీగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో 78 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు. 37 మంది ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు.
రష్యా విమాన ప్రమాదంలో 41 మంది మృతి - అత్యవసర
రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో 41 మంది మృతి చెందారు. సాంకేతిక కారణాల వల్ల సుఖోయ్ సూపర్ జెట్-100ను అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో ఒక్కసారిగా విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో 73 మంది ప్రయాణికులున్నారు.
రష్యా విమాన ప్రమాదంలో 41 మంది మృతి
రష్యాకు చెందిన సుఖోయ్ సూపర్‌జెట్-100 విమానం మాస్కో నుంచి మర్మేన్స్క్ నగరానికి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక కారణాల వల్ల అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్లు. విమానం రన్‌వేను తాకిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటం వల్ల దట్టమైన పొగ అలుముకుంది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 2011 నుంచి ఈ విమానాన్ని ప్రయాణ సేవలకు వినియోగిస్తున్నారు.
- ఇదీ చూడండి: మోదీపై తక్షణ చర్యలు తీసుకోండి: కాంగ్రెస్
Last Updated : May 6, 2019, 9:49 AM IST