తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాలో 4వేల పెంపుడు జంతువులు మృతి

సుమారు నాలుగువేల పెంపుడు జంతువులు చనిపోయిన ఘటన చైనాలో వెలుగుచూసింది. జంతువులను సరఫరా చేసే సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఈ విషాదం జరిగింది. సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు పాటించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

4,000 dogs, cats, rabbits bought online found dead in China
చైనాలో 4వేల పెంపుడు జంతువులు మృతి

By

Published : Oct 2, 2020, 12:29 PM IST

సరైన ఆహారం, నీరులేక సుమారు నాలుగువేల పెంపుడు జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాదం మధ్య చైనాలోని ఓ లాజిస్టిక్​ హబ్​లో జరిగింది. అంతర్జాల వేదికగా పెంపుడు జంతువులను సరఫరాచేసే సంస్థ అజాగ్రత్త కారణంగానే ఇంత నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలిసి అప్రమత్తమైన జంతు పరిరక్షణ అధికారులు.. దాదాపు వెయ్యి జీవులను(కుందేళ్ళు, చిట్టెలుకలు, కుక్కలు, పిల్లులు) రక్షించారు.

గతంలోనూ ఇలా పెంపుడు జంతువుల మరణాలు సంభవించాయని అక్కడి వలంటీర్​ ఒకరు తెలిపారు. అయితే.. ఇంత భారీ సంఖ్యలో జంతువులు చనిపోవడం ఇదే తొలిసారని చెప్పారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని యుథోపియా జంతు సంరక్షణ సంస్థ కోరింది. జంతువుల తరలింపులో కఠిన నిబంధనలు అమలుచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇదీ చదవండి:అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ దంపతులకు కరోనా ​

ABOUT THE AUTHOR

...view details