మయన్మార్‌లో సైన్యం మరోసారి నిరసనకారులపై కాల్పులు జరిపింది. వేరువేరు నగరాల్లో జరిగిన ఈ ఘటనల్లో పది మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అనేకమందిని అరెస్టు చేశారు. యాంగూన్ సహా ఇతర ప్రధాన నగరాల్లో రోడ్లెక్కిన ఆందోళనకారులపై బాష్పవాయువు గోళాలు, జల ఫిరంగులు ప్రయోగించారు.
మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమం చేపట్టారు. అయితే దేశంలోని యాంగూన్‌లో శుక్రవారం రాత్రి ముగ్గురిని కాల్చి చంపినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. వారం రోజులుగా విధించిన కర్ఫ్యూని కాదని ప్రజలు బయటకు రావడం వల్ల వారిని కాల్చి చంపినట్లు తెలిపారు. అతిపెద్ద నగరమైన మాండలేలో ముగ్గురు చనిపోగా.. దక్షిణ-మధ్య మయన్మార్‌లోని ప్యేయ్లో మరోకరు సైన్యం తూటాకు ప్రాణాలు వీడిచారు. అయితే ఈ ఘటనలకు సంబంధించి గాయపడిన, చనిపోయిన వారి ఫోటోలు, పలు నివేదికలు సామాజిక మాద్యమాల్లో వెలుగు చూశాయి.