యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ.. చైనాను మరో విపత్తు సంభవించింది. యున్నాన్ రాష్ట్రంలో భూకంపం వచ్చింది. నలుగురు మృతి చెందారు. 24 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
సోమవారం రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో కియాజియా కౌంటీలో రిక్టర్ స్కేలుపై 5.0 తీవ్రతతో భూమి కంపించింది. ఇది సుమారు 8 కి.మీల లోతులో సంభవించినట్లు చైనా భూకంపకేంద్రం ప్రకటించింది.