తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫిలిప్పీన్స్​లో  'వామ్కో' బీభత్సానికి  39మంది బలి - Vamco typhoon latest news

ఫిలిప్పీన్స్​లో 'వామ్కో' తుపాను బీభత్సానికి 39మంది బలయ్యారు. మరో 32మంది గల్లంతయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద ధాటికి మౌలిక సదుపాయలు దెబ్బతిని.. ప్రజలు అంధకారంలో కూరుకుపోయారు.

39 dead after typhoon leaves high water, mud in Philippines
'వామ్కో' తుపాను దాటికి 39మంది మృతి

By

Published : Nov 13, 2020, 11:41 AM IST

ఫిలిప్పీన్స్​లో 'వామ్కో' తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఇప్పటివరకు 39 మంది మరణించారు. మరో 32 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా నదులు ఉద్ధృతంగా ప్రవహించి.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు పూర్తిగా మునిగిపోవడం వల్ల ప్రజలు మిద్దెలపైకి పరుగులు తీశారు. 2 లక్షల 70 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. దీంతో 30 లక్షల 80 వేలమంది నిరాశ్రయులయ్యారు.

నివాస ప్రాంతాల్లో చేరిన వరద నీరు
ఇళ్ల మిద్దెలపైకి ఎక్కుతున్న వరద బాధితులు
సహాయక చర్యల్లో సిబ్బంది

తుపాను కారణంగా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. ఫలితంగ లక్షలాదిమంది అంధకారంలో మగ్గుతున్నారు. వందలాది చెట్లు నెలకొరిగాయి. రహదారులు కొట్టుకుపోగా.. పలు వంతెనలు కుప్పకూలిపోయాయి. వరద ప్రభావం తగ్గిన కొన్ని చోట్ల మౌలిక సదుపాయాల పునరుద్ధరణలో తలమునకలయ్యారు. సిబ్బంది.

వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
పీకలోతు వరద నీటిలో బాధితులు

సహాయక చర్యలకు రంగంలోకి దిగిన మిలటరీ బలగాలు... విపత్తు నిర్వహణ సిబ్బందితో కలిసి వేలాది మందిని రక్షించాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 3 లక్షల 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన సిబ్బంది.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఆ దేశ సైన్యాధ్యక్షుడి నేతృత్వంలో సంబంధిత అధికారులతో వరదలపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇళ్ల మిద్దెలే ఆవాసాలు
'వామ్కో' తుపాను దాటికి 39మంది మృతి

ఇదీ చూడండి:ఫిలిప్పీన్స్​ను వణికిస్తోన్న 'వామ్కో' తుపాను

ABOUT THE AUTHOR

...view details