తెలంగాణ

telangana

ETV Bharat / international

మొజాంబిక్​లో తుపాను.. 38కి చేరిన మృతులు - mozambique

మొజాంబిక్​ దేశానికి 'ఇదాయ్​ తుపాను'​ తర్వాత మరో కష్టం వచ్చిపడింది. దేశంలో ఎటు చూసిన వరదలు, భారీ వర్షాలతో మరో తుపాను విరుచుకుపడుతోంది. ఫలితంగా దాదాపు 38 మంది ఈ వరదల ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

మొజాంబిక్​లో తుపాను.. 38కి చేరిన మృతులు

By

Published : Apr 30, 2019, 6:58 AM IST

మొజాంబిక్​లో తుపాను.. 38కి చేరిన మృతులు

మొజాంబిక్​ దేశం వరుస తుపాన్లతో చిగురుటాకులా వణికిపోతోంది. నెల క్రితం 'ఇదాయ్'​ తుపాను బీభత్సం సృష్టించింది. అది మరువక ముందే ఇప్పుడు 'కెన్నెత్​' తుపాను విరుచుకుపడుతోంది. ఈ తుపానుతో ఆ దేశ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. భారీ వర్షం, వరదల ధాటికి మృతుల సంఖ్య తాజాగా 38కి పెరిగింది.

తుపానికి తోడు ఉత్తర మొజాంబిక్​లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈశాన్య ఓడరేవు​ నగరమైన పెంబాతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు మరోసారి సంభవించే అవకాశముంది. బాధితుల కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

మొజాంబిక్​లో రెండోసారి సంభవించిన తుపాను కారణంగా లక్షా 60 వేల మంది ప్రజల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. మాకోమియా జిల్లాలో వందలాది ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లెక్కలేనన్ని తాటి చెట్లు సైతం నేలకొరిగాయి. మొజాంబిక్​ దేశంలో వెనువెంటనే రెండు తుపానులు రావడం చరిత్రలో ఇదే తొలిసారి.

గతనెల్లో వచ్చిన ఇదాయ్​ తుపాను కారణంగా దాదాపు 600 మందికి పైగా మొజాంబిక్​ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత తుపాను కూడా తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

" ఏప్రిల్​ 25న అర్ధరాత్రి ఒంటిగంటకు ఈ వర్షం ప్రారంభమమైంది. ఉదయం 5 గంటల సమయంలో నా ఇల్లు కూలిపోయింది.
- ఆంటోనియో మాన్యుయేల్​, పెంబా వాసి

ABOUT THE AUTHOR

...view details