నౌకలో అగ్నిప్రమాదం- 40 మంది సజీవ దహనం! - సజీవ దహనం
![నౌకలో అగ్నిప్రమాదం- 40 మంది సజీవ దహనం! fire breaks out in ferry](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13996087-thumbnail-3x2-fire.jpg)
11:22 December 24
నౌకలో అగ్నిప్రమాదం- 40 మంది సజీవ దహనం!
Fire Accident in ferry: ప్రయాణికులతో నదిలో వెళ్తున్న ఓ నౌకలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 40 మంది సజీవ దహనమయ్యారు. మరో 150 మందికిపైగా గాయపడ్డారు. బంగ్లాదేశ్లో ఈ ప్రమాదం జరిగింది.
ఢాకా నుంచి బార్గునాకు బయల్దేరిన ఎంవీ అభిజాన్-10 నౌకలో మంటలు చెలరేగగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 3:30 గంటలకు ఈ ఘటన జరిగిందని చెప్పారు. ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 800 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు.
ఝాలాకాతి ప్రాంతంలోని సుగంధ నదిలో నౌక నుంచి 40 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించామని చెప్పారు.