బంగ్లాదేశ్లో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు. ఢాకా సమీపంలోని శ్యామ్బజార్ ప్రాంతంలో బూరీగంగా నదిలో 100 మందితో వెళ్తున్న ఓ పడవ... ఎదురుగా వస్తున్న మరో లాంచీని ఢీకొట్టగా ఈ పెను విషాదం జరిగింది.
వీరు గల్లంతు... వారు మాయం
మున్షీగంజ్ నుంచి ఢాకాకు ప్రయాణిస్తోన్న 'మార్నింగ్ బర్డ్' పడవ సాదర్ఘాట్ వద్ద.. 1000 మంది ప్రయాణికులతో కూడిన 'మొయూర్-2' లాంచీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 'మార్నింగ్ బర్డ్' బోల్తాపడింది. కొంతమంది ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా... మిగిలినవారు మునిగిపోయారు.
ఇప్పటివరకు 25 మంది పురుషులు, అయిదుగురు మహిళలు, ఇద్దరు పిల్లల మృత దేహాలను వెలికితీశారు అధికారులు. మిగతావారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.