అఫ్గానిస్థాన్లో తాలిబన్లకు, సైనిక బలగాలకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు తాలిబన్ కమాండర్లు సహా 30 మంది ముష్కరులు హతమయ్యారు. మరో 17 మంది గాయపడ్డారు. అఫ్గాన్ తూర్పు రాష్ట్రం లాఘ్మన్లో ఈ దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
లాఘ్మన్లోని దవ్లాత్ షా జిల్లాలో సైనికులపై మష్కరులు దాడికి యత్నించారు. ఈ దాడిని భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. జిల్లా తాలిబన్ ఛీప్తో పాటు ఆరుగురు స్థానిక కమాండర్లను అధికారులు అరెస్టు చేశారు.