కరోనాపై పోరులో ఇప్పటికే స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు ఆమోదముద్ర వేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన రష్యా.. మరో టీకాను సిద్ధం చేస్తోంది. వెక్టర్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ బయోటెక్నాలజీ రూపొందిస్తున్న ఈ టీకా.. మనుషులపై చేసిన ప్రయోగాల్లో సురక్షితమని తేలినట్టు ఓ నివేదిక పేర్కొంది.
ఈ 'ఎపివాక్కరోనా' వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ వచ్చే నెలలో పూర్తవుతాయని 'రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ సర్వీలియెన్స్ ఆన్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్' సంస్థ వెల్లడించింది.