రెండో దఫా భారత్-మధ్య ఆసియా దేశాల చర్చలు బుధవారం జరగనున్నాయి. వర్చువల్గా ఈ భేటీని నిర్వహిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
భారత్, ఖజికిస్థాన్, తజికిస్థాన్, తుర్కెమిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిర్గిజిస్థాన్ దేశాల విదేశాంగ మంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు. అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరవ్వనున్నారు. ఈ సమావేశంతో భౌగోళిక సంబంధాలు మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
"భౌగోళిక, అంతర్జాతీయ అంశాల్లో విదేశాంగ మంత్రులు పరస్పర అవగాహనకు రానున్నారు. రాజకీయ, రక్షణ, ఆర్థిక, వ్యాపార, మానవీయ, సాంస్కృతిక విషయాల్లో తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. భౌగోళికంగా సంబంధాలను మెరుగుపర్చుకోవడంలో ఈ భేటీ ప్రత్యేక వేదికగా మారుతుంది."