Japan fire accident: జపాన్‌లోని ఒసాకాలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో.. 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఒసాకాలోని కితాషించిలోని షాపింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎనిమిది అంతస్తుల భవనంలోని నాలుగో అంతస్తులో ఈ మంటలు చెలరేగాయని నగర అగ్నిమాపక అధికారి అకిరా కిషిమోటో తెలిపారు. ఘటనా సమయంలో 27 మంది గుండెపోటుకు గురై అపస్మారక స్థితిలో ఉన్నారని, మరో మహిళకు తీవ్రగాయాలవగా ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఇతర అంతస్తుల్లోని వ్యక్తులను ఖాళీ చేయించినట్లు వివరించారు.
మరికాసేపటికి 19 మంది మరణించారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పాయి. అయితే.. జపాన్ అధికారులు మాత్రం ఈ మృతుల సంఖ్యను నిర్ధరించలేదు. మృతుల్లో చాలా మంది కార్బన్ మోనాక్సైడ్ను పీల్చడం వల్ల చనిపోయారని బాధితులకు చికిత్స అందించిన ఓ వైద్యుడు తెలిపారు. ఈ భవనంలో ఆసుపత్రులతో పాటు.. ఓ పాఠశాల, ఇతర వ్యాపార సముదాయాలు ఉన్నాయి.
లిక్విడ్, పేపర్ బ్యాగుతో..