ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, ఆందోళనలతో ఇరాక్ అట్టుడుకుతోంది. నిరసనకారులపై ఇరాక్ సైన్యం విరుచుకుపడింది. భీకరంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 27 మంది మృతిచెందగా, 200 మందికిపైగా గాయపడ్డారు.
తిరుగుబాటుదారుల ఆందోళనలతో రాజదాని, దక్షిణ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం కూడా ఆందోళనకారులు రోడ్లను దిగ్భందించారు. పోలీసులు, మిలటరీ బలగాలు వారిపై చర్యలు ఉపక్రమించాయి.
ఈ క్రమంలో నిరసనకారులు బుధవారం... బాగ్దాద్‌కు 160 కిలోమీటర్లు దూరంలోని నజాఫ్‌లో ఉన్న ఇరాన్ కాన్సులేట్‌కు నిప్పంటించి, ధ్వంసం చేశారు. అనంతరం.. నసిరియాలో నిరసనకారులపై సైనికులు కాల్పులు జరిపారు.