ఇండోనేషియా వెస్ట్ జావా రాష్ట్రం సుమెడాంగ్ జిల్లా సిహాన్జుయాంగ్ గ్రామంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడి 13 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. 29 మందికి గాయాలైనట్లు వివరించారు. మరో 26 మంది గల్లంతయ్యారని చెప్పారు. గల్లంతైన వారికోసం గాలిస్తున్నట్లు విపత్తు నిర్వాహణ అధికారి రాధిత్యా జతి తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేశామన్నారు.
కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి- 26మంది గల్లంతు - ఇండోనేషియాలో విరిగిపడ్డ కొండచరియలు
ఇండోనేషియాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి చెందారు. మరో 26 మంది గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
కొండచరియలు విరిగి పడి 13 మంది మృతి, 26మంది గల్లంతు
సీజనల్ వర్షాలతో ఇటీవల ఇండోనేషియాలో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఇండోనేషియాలో దాదాపు 17వేల ద్వీపాలు ఉన్నాయి. అక్కడ లక్షల మంది కొండప్రాంతాల్లో జీవిస్తున్నారు.
ఇదీ చదవండి :జావా సముద్రంలో ఇండోనేసియా విమాన శకలాలు గుర్తింపు