తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గాన్​లో దాడులు- రంజాన్​ మాసంలో 255 మంది మృతి

రంజాన్ మాసం మొదలైనప్పటి నుంచి అఫ్గాన్​లో 255 మంది మృతిచెందారు. తాలిబాన్లు జరిపిన పలు బాంబు దాడుల్లో 500 మందికి పైగా తీవ్రంగా గాయాలైనట్లు టోలో వార్తా సంస్థ పేర్కొంది.

afghanisthan
అఫ్గానిస్తాన్, తాలిబాన్లు

By

Published : May 12, 2021, 10:42 AM IST

Updated : May 12, 2021, 11:53 AM IST

రంజాన్​ మొదలైనప్పటి నుంచి అఫ్గానిస్తాన్​లో జరిగిన 15 ఆత్మాహుతి దాడులు, ఇతర లక్షిత దాడుల కారణంగా 255 మంది ప్రాణాలు కోల్పోయారు. 500 మందికిపైగా క్షతగాత్రులైనట్లు టోలో వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఏప్రిల్ 13 నుంచి తాలిబాన్లు.. 200లకు పైగా బాంబు దాడులు జరిపినట్లు స్పష్టం చేసింది.

గత నెలతో పోల్చితే.. ఈనెలలో బాంబు దాడుల్లో మృతిచెందిన పౌరుల సంఖ్య 20 శాతం పెరిగినట్లు 'టోలో' పేర్కొంది.

"భద్రతా దళాలకు ధన్యవాదాలు. 800 దాడి ఘటనలను వారు నిలువరించారు. 800 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు."

--అశ్రఫ్ ఘని, అఫ్గాన్ రాష్ట్రపతి.

అమెరికా బలగాల ఉపసంహరణ మొదలైనప్పటి నుంచి అఫ్గాన్​లో తాలిబాన్ల బాంబు దాడులు పెరిగాయి. ఇప్పటికే చాలా మంది అఫ్గాన్ భద్రతా దళాలు, పౌరులు మృతిచెందారు.

ఇదీ చదవండి:'కరోనాపై పోరులో భారత్​కు మా మద్దతు ఆగదు'

Last Updated : May 12, 2021, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details