తెలంగాణ

telangana

ETV Bharat / international

విరిగిపడిన కొండచరియలు- 22 మంది బలి

నేపాల్​లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 22 మంది మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు.

22 people killed in Nepal landslides
నేపాల్​లో కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి

By

Published : Jul 10, 2020, 9:48 PM IST

నేపాల్​లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వానల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురికి గాయాలయ్యాయి.

ఖాస్కీ జిల్లా సారంగ్​కోట్​ ప్రాంతం పోఖారాలో కొండచరియలు పడి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మరో పది మందికి గాయాలవ్వగా.. వారిని ఆసుపత్రులకు తరలించారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు.

గత 48 గంటలుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాల కారణంగా దేశంలోని నారాయణి, ఇతర ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో 72 గంటల పాటు ఇలాగే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా కోటి 25 లక్షలకు చేరువలో కేసులు

ABOUT THE AUTHOR

...view details