వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి రెండు విమాన వాహక నౌకలను పంపింది అమెరికా. చైనా తనదిగా చెబుతున్న ప్రాంతంలో సైనిక విన్యాసాలు చేశాయి అమెరికా బలగాలు. హిందూ- పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతుగా ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా నావికాదళం స్పష్టం చేసింది.
ఈ మేరకు దక్షిణ చైనా సముద్రంలోకి యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్, యూఎస్ఎస్ నిమిట్జ్ నౌకలను పంపినట్లు తెలిపింది. వీటికి అనుసంధానంగా విమానాల సామర్థ్యాన్ని 24 గంటలు పర్యవేక్షించే 4 యుద్ధనౌకలు ఉంటాయి. చైనా కూడా ఇదే ప్రాంతంలో సైనిక విన్యాసాలు చేపడుతోంది. అమెరికా, చైనా రెండు దేశాలు ఇలా చేయటం ఇదే మొదటిసారి.
"అంతర్జాతీయ చట్టాలు అనుమతించిన చోట అన్ని దేశాలు ప్రయాణ, రవాణా హక్కులకు మద్దతుగా నిలవడానికి అమెరికా కట్టుబడి ఉందని చెప్పేందుకే ఈ ప్రయత్నం. ఈ ప్రాంతంలో నౌకల బృందాలకు శిక్షణతోపాటు పనిచేయడానికి ఈ అవకాశం కల్పించాం. ఫలితంగా కమాండర్లకు ఇక్కడి పరిస్థితులపై అవగాహన పెరుగుతుంది. అమెరికా నేవీ సామర్థ్యాలను ఇది మెరుగుపరుస్తుంది."
- లెఫ్టినెంట్ సీన్ బ్రోఫీ, రోనాల్డ్ రీగన్ నౌకా బృందం
చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకే..