పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో వరుస ఉగ్రదాడులు కలకలం రేపాయి. క్వెట్టా, సిబీ నగరాల్లో జరిగిన వరుస పేలుళ్లలో కనీసం ఇద్దరు మరణించారు. మరో 28మంది గాయపడ్డారు. ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకూ బాధ్యత వహించలేదు.
సిబీ నగరంలో మొదట జరిగిన పేలుడులో 24మంది గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం గంటల వ్యవధిలోనే క్వెట్టాలో రెండవ పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. కశ్మీర్ డే ర్యాలీని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ పేలుళ్లకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహించలేదని బలూచిస్థాన్ పోలీసులు తెలిపారు.