అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాద ముఠాల మధ్య అంతర్గత కలహం.. 12 మంది ముష్కరుల మృతికి దారి తీసింది. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో పాల్గొన్న ముష్కరులు.. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పారిపోయారని అఫ్గాన్ పోలీసు అధికారి అబ్దుల్ అహాద్ వాలిజాడా తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతం తమ సైనిక దళాల ఆధిపత్యంలోనే ఉందని వివరించారు.
ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్ ప్రతినిధి యూసఫ్ అహ్మది ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
మరో ఘటన..
శనివార అఫ్గాన్ రాజధాని కాబూల్‌కు పశ్చిమ భాగంలో పోలీసులు ల్యాండ్ క్రూజర్ ఎస్‌యూవీపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతిచెందగా.. కాబూల్ ఛీఫ్ మావ్లానా బయాన్ గాయపడినట్లుగా తెలుస్తోంది.