తెలంగాణ

telangana

ETV Bharat / international

అఫ్గాన్​లో మరో 2 దాడులు- 18 మంది మృతి - తాలిబన్ల దాడులు

అఫ్గాన్​లో శుక్రవారం రాత్రి రెండు చోట్ల జరిగిన దాడుల్లో 18 మంది మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. వీరిలో 10 మంది పోలీసులు ఉన్నట్లు వెల్లడించారు.

18 people killed in separate attacks in Afghanistan
అఫ్గాన్​లో పలు చోట్ల దాడులు.. 18 మంది మృతి

By

Published : Jun 13, 2020, 3:36 PM IST

అఫ్గానిస్థాన్​లో వరుస దాడులు ఆ దేశ ప్రజలను భయాందోళలకు గురి చేస్తున్నాయి. రెండు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

పసబంద్​ జిల్లాలో శుక్రవారం రాత్రి తాలిబన్లు ఓ పోలీస్​ చెక్​పాయింట్​ వద్ద జరిపిన దాడిలో 10 మంది రక్షకభటులు మరణించారు. ఈ దాడి తాలిబన్లు చేసినట్లు అధికారులు భావిస్తున్నప్పటికీ... ఇప్పటి వరకు ఈ ఘటనపై వారు ఎటువంటి ప్రకటన చేయలేదు.

మరో ఘటన..

అదే సమయంలో తూర్పు ఖోస్ట్ రాష్ట్రంలో మాజీ సైనికాధికారి లక్ష్యంగా కొంత మంది దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ ఈ దాడి ఎవరు చేశారో తెలియరాలేదు.

శుక్రవారం ఉదయం కూడా ఆ దేశ రాజధాని కాబూల్​లో ఓ ప్రార్ధన మందిరంపై బాంబు దాడి జరగగా... మత గురువు సహా మొత్తం నలుగురు మృతి చెందారు.

ఇదీ చూడండి:లైవ్​ వీడియో: కుప్పకూలిన 4 అంతస్తుల భవనం

ABOUT THE AUTHOR

...view details