తెలంగాణ

telangana

ETV Bharat / international

నిరసనకారులపై ఇరాక్ సైన్యం కాల్పులు- 18 మంది మృతి - iraq protests 2019

ఇరాక్​లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. కర్బాలా నగరంలో నిరసనకారులపై ఇరాక్​ సైన్యం విచక్షణా రహితంగా కాల్పులు జరపడం వల్ల 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 800మంది గాయపడ్డారు.

నిరసనకారులపై ఇరాక్ సైన్యం కాల్పులు-18 మంది మృతి

By

Published : Oct 29, 2019, 5:47 PM IST

నిరసనలతో అట్టుడుకుతోన్న ఇరాక్​లో ఆందోళనలు మంగళవారం మరింత తీవ్రమయ్యాయి. కర్బాలా నగరంలో ఆందోళనకారులపై ఇరాక్​ సైన్యం విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందారు. దాదాపు 800 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

నిరసనకారులపై ఇరాక్ సైన్యం కాల్పులు-18 మంది మృతి

ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఇరాక్ ప్రజలు వరుసగా ఐదోరోజు వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టిన నేపథ్యంలో.. ఈ కాల్పులు జరిగాయి. కర్బాలాలోని ఎడ్యుకేషన్ స్క్వేర్​లో ఆందోళన చేపట్టిన వారిపై కారులో వచ్చిన వ్యక్తులు బుల్లెట్ల వర్షం కురిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నల్లదుస్తులు, మాస్క్​లు​ ధరించిన భద్రతా దళాలు నిరసనకారులపై భీకర కాల్పులు జరిపినట్లు చెప్పారు.

శుక్రవారం ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలలో ఇప్పటివరకు దాదాపు 90 మంది నిరసనకారులు మరణించారు. ఈ నెల మెదట్లో ఇదే తరహా ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో 149 మంది బలయ్యారు.

ABOUT THE AUTHOR

...view details