చైనాలో ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరిగింది. 166 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఆయిల్ ట్యాంకర్ ప్రమాదంలో 18కి పెరిగిన మృతుల సంఖ్య ఝెజియాంగ్ రాష్ట్రంలోని వెన్లింగ్ నగరం సమీపంలోని షెన్యాంగ్-హైకో ఎక్స్‌ప్రెస్ వేలో ఆయిల్ ట్యాంకర్ పేలిపోయింది. దీనితో ప్రధాన రహదారిపై ఉన్న కార్లు, వాహనాలకు మంటలు అంటుకున్నాయి.
మరో పేలుడు
ఆయిల్ ట్యాంకర్ పేలి పక్కనున్న ఓ వర్క్‌షాపులో పడిపోవటం వల్ల.. రెండో పేలుడు సంభవించింది. దీంతో సమీపంలోని ఇళ్లు, పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఆయిల్ ట్యాంకర్ ప్రమాదం- సహాయక చర్యలు ముమ్మరం రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రహదారిపై వాహనాల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:మాటవరసకేనా మద్దతు.. అన్నదాతకు భరోసా ఏదీ?