తెలంగాణ

telangana

ETV Bharat / international

కల్తీ మద్యం తాగి 16 మంది మృతి

వాయవ్య బంగ్లాదేశ్​లోని వివిధ ప్రాంతాల్లో కల్తీ మద్యం సేవించి మూడు రోజుల వ్యవధిలోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు.

consumption of spurious liquor
కల్తీ మద్యం తాగి 16 మంది మృతి

By

Published : May 28, 2020, 9:22 AM IST

Updated : May 28, 2020, 10:42 AM IST

ఈద్​-ఉల్​- ఫితర్​ (రంజాన్​) వేడుకల్లో విషాదం జరిగింది. వాయవ్య బంగ్లాదేశ్​లో కల్తీ మద్యం తాగి మూడు రోజుల వ్యవధిలోనే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10​ మందికిపైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

" కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 16 మంది మృతిచెందారు. అందులో కొందరు ఇంటి వద్దే మరణించగా.. కొందరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో అక్రమంగా మద్యం తయారు చేసే ప్రాంతాలను గుర్తించి, ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించాం."

- సీనియర్​ అధికారులు

మరోవైపు.. బంగ్లాదేశ్​ అధికారిక వార్తా సంస్థ మాత్రం వీరంతా రెండు వేరు వేరు ఘటనల్లో మృతి చెందినట్లు పేర్కొంది.

Last Updated : May 28, 2020, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details