తెలంగాణ

telangana

ETV Bharat / international

గనిలో 16 మందిని బలిగొన్న కార్బన్​ మోనాక్సైడ్

చైనా కిజియాంగ్​ జిల్లాలోని ఓ బొగ్గు గనిలో చిక్కుకుని 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గని లోపల కార్బన్​ మోనాక్సైడ్​ స్థాయులు పరిమితికి మించటం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

coal mine accident in China
బొగ్గు గనిలో ఘోర ప్రమాదం

By

Published : Sep 27, 2020, 6:18 PM IST

చైనాలోని కిజియాంగ్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చాంగ్​కెంగ్ మున్సిపాలిటి పరిధిలో​ని సాంగ్జావో బొగ్గు గనిలో చిక్కుకుని 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కార్బన్​ మోనాక్సైడ్​ స్థాయులు పెరిగిపోవటం వల్లే ప్రాణ నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

గని లోపల మండుతున్న బొగ్గుతో కార్బన్​ మోనాక్సైడ్​ స్థాయులు భద్రతా పరిమితిని మించి పోయాయని, 17 మంది అందులోనే చిక్కుకుపోవటం వల్ల ప్రమాదం జరిగినట్లు చైనా అధికారిక మీడియా జిన్హువా నివేదించింది.

75 మందితో కూడిన రెస్క్యూ బృందం, 30 మంది ఆరోగ్య సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

సాంగ్జావో బొగ్గు గని స్థానిక ఇంధన సంస్థకు చెందినదిగా అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:సైన్యం కళ్లుగప్పేందుకు ఉగ్రవాదుల నయా ట్రెండ్​

ABOUT THE AUTHOR

...view details