బంగ్లాదేశ్‌లో ఓ వివాహ బృందంపై పిడుగులు పడిన ఘటనలో ఏకంగా 16 మంది మరణించారు. చాపై నవాబ్‌గంజ్ జిల్లా శిబ్‌గంజ్ అనే ప్రాంతంలో వివాహ బృందం పడవలో ప్రయాణిస్తుండగా ఈ పిడుగులు పడినట్లు తెలుస్తోంది. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో వరుడు సైతం ఉడటంతో బంధువులు రోదనలు మిన్నంటాయి.
'వివాహ బృందం ప్రయాణిస్తున్న పడవపై సెకన్ల వ్యవధిలో పిడుగులు పడి.. సంఘటనా స్థలంలోనే 16 మంది మరణించారని' సకీబ్ అల్ రబ్బీ అనే అధికారి తెలిపారు. 'అదృష్టవశాత్తూ వధువు ఈ పడవలో లేదని' చెప్పారు.