అఫ్గానిస్థాన్‌లోని దక్షిణ కాందహార్ రాష్ట్రంలో 15 మంది తాలిబన్ ఉగ్రవాదుల్ని హతమార్చినట్టు ఆ దేశ సైన్యం తెలిపింది. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడినట్టు వెల్లడించింది ఆ దేశ రక్షణ శాఖ.
అఫ్గాన్ సైన్యం చేతిలో 15 మంది తాలిబన్లు హతం - అఫ్గాన్ భద్రతా బలగాలు
దక్షిణ కాందహార్‌లో 15 మంది తాలిబన్లను అఫ్గాన్ సైన్యం మట్టుబెట్టింది. పక్కా ప్రణాళికతో ప్రతీకార దాడులు నిర్వహించి ఉగ్రవాద స్థావరాలనూ ధ్వంసం చేసింది.

15మంది తాలిబన్లను మట్టుబెట్టిన అఫ్గాన్ సైన్యం
ఈ ఘటనలో తాలిబన్లకు చెందిన ఆయుధాలు, ఇతర మందుగుండు సామగ్రి ధ్వంసం చేసినట్టు అఫ్గాన్ జాతీయ భద్రతా దళాలు(ఏఎన్ఎస్ఎఫ్) తెలిపాయి. ఈ దాడిలో ఐదు ఉగ్రవాద రహస్య స్థావరాలనూ నిర్వీర్యం చేసినట్టు పేర్కొన్నాయి.