పాకిస్థాన్‌లో రెండు గిరిజన బృందాల మధ్య జరిగిన ఘర్షణల్లో సుమారు 15మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 42మందికి గాయాలయ్యాయి. వాయువ్య పాక్‌లోని గిరిజన ప్రాంతంలో తలెత్తిన ఓ భూ వివాదంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి.
కుర్రం జిల్లాలో నాలుగు రోజులుగా టోరి- పారా చంకాని తెగల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు అత్యాధునిక ఆయుధాలతో దాడులకు పాల్పడుతున్నట్టు అధికారులు తెలిపారు.