పాకిస్థాన్ బలూచిస్థాన్ రాష్ట్రం క్వెట్టా నగరంలోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనలు చేసేవారే లక్ష్యంగా బాంబు దాడికి పాల్పడ్డారు ముష్కరులు. ఈ దుర్ఘటనలో మత గురువు, ఓ సీనియర్ పోలీసు అధికారి సహా మొత్తం 16 మంది మరణించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్వేట్టా ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలో బాంబ్ పేలడం ఇదీ రెండోసారి.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు భద్రతా సిబ్బంది.ఘటనా స్థలంలో తనిఖీలు ముమ్మరం చేశారు. సమీప ప్రాంతంలోని అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితి విధించారు.