తెలంగాణ

telangana

ETV Bharat / international

ఘోర రైలు ప్రమాదం.. 15 మంది దుర్మరణం - Train accident in bangla

బంగ్లాదేశ్​లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బ్రహ్మన్​బరియా జిల్లాలో రెండు రైళ్లు ఢీకొని.. 15 మంది మృతి చెందారు. 50 మందికిపైగా గాయపడ్డారు. లోకోపైలట్ల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఘోర రైలు ప్రమాదం.. 15 మంది దుర్మరణం

By

Published : Nov 12, 2019, 11:38 AM IST

బంగ్లాదేశ్​లో రెండు రైళ్లు ఢీకొని 15 మంది మృతి చెందారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బ్రహ్మాన్​బరియా జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఉదయాన్​ ఎక్స్​ప్రెస్​- తుర్ణా నిషితా రైళ్లు మోండోభాగ్​ రైల్వేస్టేషన్​లో ఢీకొన్నాయి.మృతుల్లో 12 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. రైలు పెట్టెల కింద చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

లోకో పైలట్లు సిగ్నల్స్​ నియమాలను పాటించనందుకే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రకటించారు. మూడు వేర్వేరు దర్యాప్తు కమిటీలు ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణను ప్రారంభించాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : హృతిక్​ను అభిమానించినందుకు భార్యను చంపిన భర్త!

ABOUT THE AUTHOR

...view details