తెలంగాణ

telangana

By

Published : Aug 11, 2021, 6:18 PM IST

Updated : Aug 11, 2021, 10:22 PM IST

ETV Bharat / international

ఆ దేశాల నుంచే ఎక్కువ పోర్న్​.. మన​ స్థానం ఎంతంటే?

ఇంటర్నెట్​ వినియోగం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతోంది. అంతర్జాలం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నట్లే.. నీలి చిత్రాల కంటెంట్​ కూడా అధికమవుతోంది. పలు దేశాలు ఎక్కువగా పోర్న్​ ప్రొడక్షన్ చేస్తున్నాయి. ఇందులో భారత్ స్థానం ఎంతంటే?

porn
పోర్న్​

కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వాడకం గణనీయంగా పెరిగింది. అయితే అంతర్జాల వినియోగంలో ఎక్కువశాతం అశ్లీల చిత్రాల వీక్షణకే ఉపయోగిస్తున్నారని పలు అధ్యాయనాలు తేటతెల్లం చేస్తున్నాయి! కంప్యూటర్​, ఇంటర్నెట్​, స్మార్ట్​ఫోన్​లు అందుబాటులోకి వచ్చాక క్లిక్​ దూరంలోనే ఇవి దొరికేస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ప్రపంచంలోనే అభివృద్ధి దిశగా సాగుతున్న పోర్న్​ఇండస్ట్రీ.

ఇటీవల నటి శిల్పాశెట్టి భర్త రాజ్​కుంద్రా.. నీలి చిత్రాల దందా కేసులో అరెస్ట్​ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే మన దగ్గర మినహా చాలాదేశాల్లో ఈ వ్యాపారం చట్టపరమే! అందుకే అక్కడ భారీ స్థాయిలో ఈ అశ్లీల కంటెంట్​ అంతర్జాలంలో వినియోగదారులకు సులువుగా దొరికేస్తోంది. అయితే ఈ పోర్న్​ ఇండస్ట్రీ ఇంతలా అభివృద్ధి చెందడానికి డిమాండ్​ అండ్​ సప్లై కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి​.

అప్పటి నుంచే

20శతాబ్దం ముందు వరకు ఈ పోర్నోగ్రఫీ అంతగా ప్రాచుర్యంలో లేదు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే కార్పొరేట్ ఇందులోకి రంగ ప్రవేశం చేసిందో అప్పటినుంచి ఈ ఇండస్ట్రీ పరిధి ఎవరూ ఊహించలేనంతగా పెరిగింది. ఆర్ధికంగానూ ఎంతో బలపడింది. అయితే ఈ ఇండస్ట్రీలో వేధింపులు, కంటెంట్​ పైరసీ, అవినీతి​ వంటి ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

అశ్లీల కంటెంట్ ఎక్కువగా ప్రొడక్షన్ చేసే దేశాలు

  • అమెరికా: 24.52 శాతం
  • యునైటెడ్​ కింగ్​డమ్​: 5.49 శాతం
  • జర్మనీ: 4.90 శాతం
  • బ్రెజిల్​: 4.80 శాతం
  • ఫ్రాన్స్​: 4.01 శాతం
  • రష్యా 4.01 శాతం
  • కెనడా 3.19 శాతం
  • భారత్​ 3.18 శాతం
  • ఇటలీ 2.64 శాతం
  • స్పెయిన్​ 2.46 శాతం
  • నెథర్లాండ్స్​ 1.92 శాతం
  • టర్కి 1.82 శాతం
  • పొలాండ్​ 1.78 శాతం
  • ఆస్ట్రేలియా 1.55 శాతం

ఇదీ చూడండి: అశ్లీలానికి ప్రభావితమై నేరస్థులుగా మారుతున్న విద్యార్థులు

Last Updated : Aug 11, 2021, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details