తెలంగాణ

telangana

ETV Bharat / international

రోడ్డుప్రమాదంలో కుటుంబమంతా..! - ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటంబంలో 14మంది మృతి

నేపాల్​లోని బాగ్​లుడ్​​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది దుర్మరణం చెందారు. మరో ముగ్గురు గాయాల పాలయ్యారు. ఓ వేడుకకు జీపులో వెళ్తుండగా అదుపు తప్పి చెరువులో పడిపోయింది.

nepal
ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటంబంలో 14మంది మృతి

By

Published : Dec 3, 2019, 9:51 PM IST

నేపాల్​ బాగ్​లుడ్​ జిల్లా భింగిఠే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీపు అదుపు తప్పి చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన 14 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ జరిగింది...

గుల్మీ జిల్లాలో ఓ వేడుకకు హాజరయ్యేందుకు జీపులో పయనమయింది ఆ కుటుంబం. దారి మధ్యలో భింగిఠే వద్ద అదుపు తప్పి.. రోడ్డు నుంచి 300 మీటర్ల దిగువన చెరువులోకి పడిపోయింది. మృతి చెందిన 14 మందిలో 9 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు.మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: కీలక పదవికి జైలు నుంచే ఎన్నికైన లాలూ

ABOUT THE AUTHOR

...view details