తెలంగాణ

telangana

ETV Bharat / international

బొగ్గుగనిలో గ్యాస్ పేలుడు- 14 మంది కార్మికులు మృతి - coal mine blast news

చైనాలోని బొగ్గు గనిలో గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. శిథిలాల్లో మరో ఇద్దరు చిక్కుకున్నారు.

coal mine blast
బొగ్గుగనిలో గ్యాస్ పేలుడు.

By

Published : Dec 17, 2019, 10:26 AM IST

చైనా గుయీఝోవూ రాష్ట్రం ఎన్లాంగ్ కౌంటీలోని బొగ్గుగనిలో గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గని లోపల చిక్కుకున్నారు.

మంగళవారం ఉదయం 1:30 గంటలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో గనిలో మొత్తం 23 మంది కార్మికులు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో 14 మంది చనిపోగా... మరో ఏడుగురిని రక్షించినట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు.

తరచూ ప్రమాదాలు

సిచౌన్​లోని ఓ గనిలో వరదల కారణంగా ప్రమాదం జరిగి ఐదుగురు మరణించిన 3 రోజులకే ఇప్పుడు మరో ఘటన జరిగింది. శాంక్జీలో గతనెలలో ఓ గనిలో పేలుడు ప్రమాదం జరిగి 15మంది మృత్యువాత పడ్డారు.

చైనాలోని గనుల్లో వరుసగా ప్రమాదాలు జరగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలున్నాయి. భద్రతా ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకోవట్లేదని స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: 'బ్రెగ్జిట్'​ కల సాకారానికే 'బ్రిటన్' ఓటర్ల మొగ్గు

ABOUT THE AUTHOR

...view details