బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హత్యకు కుట్ర పన్నిన 14మందికి ఢాకా కోర్టు మరణశిక్ష విధించింది. 2000 జులై 21న గోపాల్‌గంజ్ కోటలిపారా ప్రాంతంలో ఎన్నికల ప్రచార ర్యాలీకి హాజరైన హసీనాను హత్య చేసేందుకు వీరంతా 76 కిలోల బాంబును అమర్చారు.
ఈ కేసులో దోషులందరూ నిషేధిత హర్కతుల్ జిహాద్ బంగ్లాదేశ్(హుజీ-బి)కి చెందిన కార్యకర్తలు. వీరిలో తొమ్మిది మందిని విచారణ నిమిత్తం కోర్టులో హజరుపరిచారు. పరారీలో ఉన్న ఐదుగురు లొంగిపోయిన అనంతరం తీర్పును అమలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.