రష్యా సముద్రజలాల్లో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ నౌకాదళానికి చెందిన ఏఎస్-12 అనే జలాంతర్గామి(సబ్మెరైన్)లో అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో వెలువడిన విష ఉద్ఘారాలకు ఊపిరాడక 14 మంది నావికులు మృతిచెందినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది.
సన్నాహాల్లో భాగంగా రష్యా ఉత్తర భాగంలోని ఓ ప్రాంతంలో జలాంతర్గామి సాంకేతికతపై ప్రయోగాలు జరుపుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రస్తుతం దీనిని సెవరోమార్స్క్ మిలటరీ బేస్కు తరలించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం గురించి అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. రష్యా నౌకాదళం, సైన్యానికి ఈ ప్రమాదం తీరని నష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు పుతిన్. నావికాదళ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఘటనపై విచారణకు ఆదేశించారు.