ఫిలిప్పీన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎస్యూవీ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో 13 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ కూడా మృతి చెందినట్లు పేర్కొన్నారు.
ఎస్యూవీ కాలువలోకి దూసుకెళ్లి 13 మంది మృతి - car fall into irrigation canal
ఫిలిప్పీన్స్లో జరిగిన కారు ప్రమాదంలో 13 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది చిన్నారులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు గాయపడినట్లు వెల్లడించారు.

ఫిలిప్పీన్స్లో కారు ప్రమాదం
కళింగ రాష్ట్రంలోని తబుక్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సమీపంలోని గ్రామస్థుల సాయంతో బాధితులను వెలికితీశారు. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Last Updated : Apr 19, 2021, 9:06 AM IST