తెలంగాణ

telangana

ETV Bharat / international

సొరంగంలో చిక్కుకొని 13 మంది మృతి - china flood deaths

నిర్మాణ పనులు కొనసాగుతున్న సొరంగంలోకి వరదనీరు ప్రవేశించగా.. చిక్కుకుపోయిన కార్మికుల్లో 13 మంది మృతిచెందారు. చైనాలో ఈ ఘటన జరిగింది. మరోవైపు.. చైనాలో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా పరిస్థితులు 'అత్యంత తీవ్రం'గా మారాయని ఆ దేశ అధ్యక్షుడు జిన్​పింగ్​ పేర్కొన్నారు.

china tunnel rescue
చైనా సొరంగ ప్రమాదంలో మృతులు

By

Published : Jul 22, 2021, 10:46 AM IST

Updated : Jul 22, 2021, 12:01 PM IST

చైనాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల కారణంగా నిర్మాణ పనులు కొనసాగుతున్న ఓ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల్లో.. 13 మంది మృతిచెందారు. ఝుహాయ్​ నగరం జింగ్యే ఎక్స్​ప్రెస్​వేలోని షిజింగ్​షాన్​ సొరంగంలో ఈ ఘటన జరిగింది.

జులై 15న మొత్తం 14 మంది కార్మికులు ఈ సొరంగంలో చిక్కుకున్నారు. ఇప్పటివరకు 13 మంది మృతదేహాలను వెలికితీశారని ప్రభుత్వ మీడియా జిన్హువా న్యూస్​ తెలిపింది. ఇంకో కార్మికుడి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది.

2,400 మందికి పైగా సిబ్బంది.. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఘటనాస్థలికి 200కుపైగా వాహనాలు చేరుకున్నాయి. అయితే.. వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి.

సొరంగం వద్ద సహాయక చర్యలు

'అత్యంత తీవ్రంగా..'

చైనాలో అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. పరిస్థితులు 'అత్యంత తీవ్రంగా' ఉన్నాయని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటమే ప్రధాన బాధ్యతగా భావించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంతగా..

చైనాను అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. హెనాన్‌ ప్రావిన్స్‌లో గత 1000ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురవడం వల్ల భీకర వరదలు సంభవించాయి. ఫలితంగా 33 మంది చనిపోగా.. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులున్నారు. ఓ రైల్వే స్టేషన్​లోకి ఒక్కసారిగా వరద నీరు ప్రవేశించడం వల్ల వారంతా చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు.

ఇదీ చూడండి:1000 ఏళ్లలో అతిపెద్ద కుంభవృష్టి- 25 మంది బలి

ఇదీ చూడండి:చైనాలో భీకర వరదలు- 12 మంది మృతి

ఇదీ చూడండి:వరద బీభత్సం- నీటమునిగిన జనావాసాలు!

Last Updated : Jul 22, 2021, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details