జపాన్ తీర ప్రాంతాల్లో తీవ్ర హిమపాతం కారణంగా ఇప్పటివరకు 13మంది మృతి చెందారు. సుమారు 250 మంది గాయపడ్డారు. ఈ మేరకు వెల్లడించిన విపత్తు నిర్వహణ విభాగం.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది.
ఫుకుయ్ జిల్లాలో 60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు గల ముగ్గురు వృద్ధులు మృతిచెందారని తెలిపింది. మరో 47 మంది హిమపాతానికి సంబంధించి జరిగిన ప్రమాదాల్లో గాయపడ్డారని పేర్కొంది. నీగటా జిల్లాలో మంచును తొలగించే క్రమంలో నలుగురు మృతి చెందారని తెలిపింది.