పాకిస్థాన్ పంజాబ్ రాష్ట్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలాకతాయ్-నరాంగ్ మండీ రోడ్డు మార్గంలో బస్సు, వ్యాను ఢీ కొన్నాయి. దీంతో వ్యానులోని సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు. 17 మందికి గాయాలయ్యాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సయాయక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
బస్సు, వ్యాను ఢీ -13 మంది సజీవ దహనం - పాకిస్థాన్ ప్రమాదం
పాకిస్థాన్లో దారుణం జరిగింది. బస్సు, వ్యాను ఢీ కొన్న ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 17 మంది గాయపడ్డారు.
బస్సు, వ్యాను ఢీ -13మంది సజీవ దహనం
దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్డు మార్గం సరిగా కనపడక ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బజ్దార్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.