నిర్విరామ వర్షాలతో..
48 గంటలుగా నిర్విరామంగా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ నేపాల్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగి పడి 12మంది మృతి చెందారు. ఈ మైరకు పోలీసులు వివరాలను వెల్లడించారు. కొండ చరియలు పడి ఇళ్లకు ఇళ్లే కుప్పకూలాయి. ఈ ఘటనలో... ఖాస్కీ జిల్లా సారంగ్కోట్లో ముగ్గురు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇతర చోట్ల జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో మరో ఐదుగురు బలయ్యాయి. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 40 మంది గల్లంతయ్యారు