నేపాల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదలకు తోడు కొండచరియలు విరిగిపడుతూ భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. తాజాగా సింధుపాల్‌చౌక్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి చెందారు. ఐదుగురు తీవ్రంగా గాయప్డడారు. మరో 27 మంది ఆచూకీ గల్లంతు అయ్యింది.
" జిల్లాలోని జకల్ రూరల్ మున్సిపాలిటీ పరిధిలోని లిజిమొ లామా ప్రాంతంలో కొండచరియలు విరిగిపి 13 ఇళ్లు పూర్తిగా శిథిలాల్లో కూరుకుపోయాయి. ఈ దుర్ఘటనలో ఐదు కుటుంబాలకు చెందిన 27 మంది ఆచూకీ గల్లంతయ్యింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రాంతంలో ఉన్న మరో 30 ఇళ్లకు ప్రమాదం పొంచి ఉంది. "