తెలంగాణ

telangana

By

Published : Sep 20, 2021, 9:23 PM IST

ETV Bharat / international

ప్రపంచంలోనే వృద్ధ కవలలు.. గిన్నీస్​లో చోటు

అత్యంత వృద్ధ కవలలుగా (Oldest Twins in the World) గిన్నీస్ బుక్​లో చోటు సంపాదించుకున్నారు జపాన్​కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు. (Oldest Twin Sisters) 107 సంవత్సరాల 330 రోజుల వయస్సుతో ఈ రికార్డు సాధించారు. (Oldest twins alive)

world's oldest twins
ప్రపంచంలోనే వృద్ధ కవలలు.. గిన్నీస్​లో చోటు

అత్యంత పెద్దవయస్సు గల కవలలుగా (Oldest Twins in the World) జపాన్‌కు చెందిన ఇద్దరు వృద్ధులు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్నారు. ఉమేనో సుమియామ, కౌమె కొదమా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు (Oldest Twin Sisters) 107 సంవత్సరాల 330 రోజుల వయస్సుతో రికార్డు సృష్టించినట్లు గిన్నీస్‌ బుక్‌ తెలిపింది. (Oldest Twins in the World 2021)

వృద్ధ కవలలు
ఉమేనో సుమియామ(ఎడమ), కౌమె కొదమా

పశ్చిమ జపాన్‌లోని షోడోషిమా దీవిలో 1913 నవంబర్‌ 5న వీరిద్దరు జన్మించారు. (Oldest twins alive) సెప్టెంబరు 1నాటికి వీరి వయసు ఇంతకు ముందు ఉన్న రికార్డును అధిగమించినట్లు గిన్నిస్ సంస్థ వెల్లడించింది. జపాన్‌లో జాతీయ వృద్ధాప్య దినోత్సవం రోజున ఈ ప్రకటన చేశారు. (Oldest Twins in Japan) కరోనా కారణంగా వారి ధ్రువపత్రాలను మెయిల్‌లో అందించగా... గిన్నీస్‌ బుక్‌లో చోటు దక్కడంపై వృద్ధ కవలలు హర్షం వ్యక్తం చేశారు.

మార్షల్ ఆర్ట్స్ డ్రెస్​లో..
అప్పట్లో అలా...

జపాన్‌లో ఉన్న 12.5 కోట్ల జనాభాలో 29 శాతం మంది 65 సంవత్సరాల పైబడినవారే ఉన్నారని అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. దాదాపు 86,510 మంది వందేళ్లు పూర్తి చేసుకున్నారని... వీరిలో సగం మంది ఈ ఏడాదే 100 ఏళ్లు దాటారని వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధుల జనాభా జపాన్‌లో పెరుగుతోంది.

కవలల పుట్టిన రోజు సందర్భంగా..

ఇదీ చదవండి:కోడి మెదడు తింటా... అందుకే ఇలా..: 111 ఏళ్ల వృద్ధుడు

ABOUT THE AUTHOR

...view details