తెలంగాణ

telangana

ETV Bharat / international

పాకిస్థాన్​​లో​ భూకంపం: 20కి చేరిన మృతులు - పాక్ భూకంపం తీవ్రత

పాకిస్థాన్ పంజాబ్​లోని పర్వత నగరమైన జెహ్లం సమీపంలో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా 20 మంది మృతి చెందగా... 300 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైందని పాక్ వాతావరణశాఖ తెలిపింది. పాక్ విజ్ఞాన శాఖ మంత్రి ఫవాద్​ చౌదరి మాత్రం తీవ్రతను 7.1గా ప్రకటించారు.

పాక్​లో​ భూకంపం - ఒకరు మృతి, 50 మందికి గాయాలు

By

Published : Sep 24, 2019, 7:02 PM IST

Updated : Oct 1, 2019, 8:48 PM IST

పాక్​లో​ భూకంపం - ఇద్దరు మృతి, 100 మందికి గాయాలు

పాకిస్థాన్, పీఓకేను భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం దాటికి ఇప్పటివరకు 20 మంది మృతి చెందారు. చిన్నారులు, మహిళలు సహా 300పైగా మంది గాయపడ్డారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్​ సహా ఉత్తర భారతదేశంలోని పలు నగరాల్లో భూకంప ప్రభావం కనిపించింది.

పాకిస్థాన్ పంజాబ్​లోని పర్వత నగరమైన జెహ్లం సమీపంలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని పాక్​ వాతావరణశాఖ తెలిపింది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని స్పష్టం చేసింది. అయితే, భూకంప తీవ్రత రిక్టర్​ స్కేలుపై 7.1గా నమోదైందని పాక్​ విజ్ఞాన శాస్త్ర మంత్రి ఫవాద్​ చౌదరి పేర్కొనడం గమనార్హం.

భూకంపం దాటికి పీఓకేలోని మీర్​పుర్​లో ఓ మసీదు కుప్పకూలింది. రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ఆ ప్రాంతంలోని ఆసుపత్రుల వద్ద అధికారులు ఎమర్జెన్సీ ప్రకటించారు. భూకంప బాధితుల కోసం తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని.. ఆ దేశ ఆర్మీ చీఫ్​ జనరల్ కమర్​ జావేద్​ బజ్వా అధికారులను ఆదేశించారు.

పాకిస్థాన్​లోని పెషావర్​, రావల్పిండి, లాహోర్​ సహా పలు నగరాల్లో భూకంప తీవ్రత కనిపించింది. భారత్​లోని దిల్లీ, పంజాబ్​, హరియాణాలోనూ భూమి కంపించింది.

ఇదీ చూడండి: పసిడి మళ్లీ పైపైకి.. నేడు ఎంత పెరిగిందంటే?

Last Updated : Oct 1, 2019, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details