అమెరికా ప్రభుత్వం కన్నా ముందే.. టిక్‌టాక్‌తో దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భయాలు రేకెత్తించినట్లు ప్రముఖ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇటీవల ప్రచురించిన ఓ కథనంలో టిక్‌టాక్‌పై జుకర్‌బర్గ్ వ్యక్తం చేసిన పలు అభ్యంతరాలను ప్రస్తావించింది. ప్రస్తుత పరిణామాలకు మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తం చేసిన ఆందోళనలే ఆజ్యం పోశాయనేది ఈ కథనం సారాశం.
చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌పై ఆంక్షల దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం కూడా చేశారు. టిక్‌టాక్‌ను 90 రోజుల్లో విక్రయించకుంటే నిషేధం తప్పదని దాని మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌కు ఇదివరకే డెడ్‌లైన్ కూడా విధించారు. ముఖ్యంగా ఇటీవల టిక్‌టాక్ అంశాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది. అయితే వాల్ట్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. టిక్‌టాక్‌పై ఆంక్షలకు జరుగుతున్న కసరత్తు ఇటీవలిది కాదని తెలుస్తోంది.
ట్రంప్-జుకర్‌బర్గ్ విందులో కీలక నిర్ణయాలు?
బైట్ డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్ సంస్థ భావ ప్రకటన స్వేచ్ఛకు కట్టుబడి లేదని, అమెరికా సాంకేతికతకు ఇది ముప్పుగా మారుతుందనే ఆందోళన మార్క్ వ్యక్తం చేసినట్లు ఈ కథనంలో పేర్కొంది వాల్ స్ట్రీట్ జర్నల్. శ్వేతసౌధంలో ట్రంప్ ప్రత్యేకంగా ఇచ్చిన విందులో మార్క్ జుకర్‌బర్గ్‌కు చైనా ఇంటర్నెట్ కంపెనీలపై కేసు వేసేందుకు అవకాశం కూడా పొందినట్లు వాల్ స్ట్రీట్ రాసుకొచ్చింది.