Zelenskyy us congress: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు గత 20 రోజులుగా క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఈ తరుణంలో తమకు తక్షణం అమెరికా సాయం అవసరమని కోరారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. అమెరికా కాంగ్రెస్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన జెలెన్స్కీ.. ముత్యాల నౌకాశ్రయం(పెర్ల్ హర్బర్), 9/11 ఉగ్రదాడిని ప్రస్తావించారు. రష్యాపై పోరాటంలో ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు అమెరికా కాంగ్రెస్ మరిన్ని చర్యలు తీసుకోవాలని విన్నవించారు. తమ దేశ గగనతలాన్ని మూసివేయాలన్న వాదన(నో ఫ్లై జోన్) నెరవేరకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
క్యాపిటోల్ కాంప్లెక్స్‌లో లైవ్‌స్ట్రీమింగ్‌లో మాట్లాడిన జెలెన్స్కీ.. రష్యన్ చట్టసభ్యులపై ఆంక్షలు విధించాలని, దిగుమతులను నిలిపేయాలని కోరారు. తమ దేశంపై యుద్ధంతో ఎదుర్కొంటున్న విధ్వంసానికి సంబంధించిన వీడియోలను చూపించారు.
"తక్షణం మీ సాయం అవసరం. మరిన్ని చర్యలు చేపట్టాలని మిమ్మల్ని కోరుతున్నా. ఆదాయం కన్నా శాంతి చాలా ముఖ్యమైన అంశం. మరణాలను ఆపలేకపోతే నా జీవితానికి అర్థం లేదు."