తెలంగాణ

telangana

ETV Bharat / international

'అమ్మ నమ్మకమే నన్ను ఈ స్థాయికి చేర్చింది' - kamala harris after sworn

తన తల్లి తనపై పెట్టుకున్న నమ్మకమే తనను ఈ స్థాయికి చేర్చిందని అన్నారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్​. తనను, తన సోదరిని ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉండాలని ఆమె చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.

kamala harris
అమ్మ నమ్మకమే నన్ను ఈ స్థాయికి చేర్చింది: కమల

By

Published : Jan 21, 2021, 2:41 PM IST

అగ్రరాజ్య 49వ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేసి చరిత్ర లిఖించారు భారత సంతతి కమలా హారిస్​. ఈ సందర్భంగా ఆమె తన తల్లి దివంగత శ్యామలా గోపాలన్​ను గుర్తు చేసుకున్నారు. తనపై, తన సోదరిపై తన తల్లి పెట్టుకున్న నమ్మకమే.. తనను ఈ స్థాయికి చేర్చిందని పేర్కొన్నారు. తమను ఎల్లప్పుడూ మొదటి స్థానంలోనే ఉండాలని ఆమె చెప్పేవారని తెలిపారు. ఆసియాన్​, అమెరికాన్ ప్రమాణ స్వీకార కమిటీ, అమెరికా న్యాయవాద, రాజకీయ కార్యచరణ కమిటీ ఇంపాక్ట్​ ఆధ్వర్యంలో వర్చువల్​గా జరిగిన సమావేశంలో మాట్లాడారు.

"నా కథ లక్షలాది మంది అమెరికన్లది. భారత్​ నుంచి మా అమ్మ శ్యామలా గోపాలన్​.. అమెరికాకు వచ్చారు. ఆమె నన్ను, మా సోదరి మాయను ఎల్లప్పుడూ మొదటి స్థానంలోనే ఉండాలని చెప్పేవారు. చివర ఎప్పుడూ ఉండకూడదని బోధించారు. ఆమె మాపై ఉంచిన నమ్మకమే.. మాకు ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టింది."

- కమలా హారిస్​, అమెరికా ఉపాధ్యక్షురాలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో కలిసి అమెరికా ప్రజల కలలను సాకారం చేసేందుకు ప్రయత్నిస్తానని కమలా హారిస్​ చెప్పారు.

అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి నల్లజాతీయురాలిగా చరిత్రలో నిలిచారు 56ఏళ్ల కమల. ఈ పదవిని ఓ మహిళ చేపట్టడం కూడా ఇదే తొలిసారి. కమల తల్లిదండ్రులిద్దరూ అమెరికాకు వలస వెళ్లినవాళ్లే. ఆఫ్రికా మూలాలున్న తండ్రి డొనాల్డ్‌ హారిస్‌ జమైకా నుంచి వెళ్లారు. తల్లి శ్యామలా గోపాలన్‌ ఇండియా నుంచి 1958లో వలస వెళ్లారు.

బైడెన్​ బృందంలో చేరే ముందు నుంచే కమలా హారిస్​కు అమెరికా అధ్యక్ష హోదా అధికారాన్ని సాధించాలనే కలలు ఉండేవి. కానీ, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆ ప్రచారాన్ని మానేశారు. ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం కంటే ముందు కూడా తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్​ చేశారు కమల. తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం తన తల్లి అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అగ్రరాజ్యంలో మెరిసిన భారతీయ కమలం

ABOUT THE AUTHOR

...view details