ఈ నెల 21న జరగనున్న 6వ యోగా అంతర్జాతీయ దినోత్సవం కోసం అమెరికన్ వాసులు ఎంతో కుతూహలంగా ఉన్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో ఈసారి సామూహికంగా కాకుండా.. ఇళ్లల్లోనే ఉంటూ యోగా చేయాలని నిర్ణయించుకున్నారు.
"ఈ ఏడాది 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇందుకోసం 'యోగా ఫ్రమ్ హోం' అనే థీమ్‌ను ఎంచుకున్నాం. మనిషి ఆరోగ్యం కోసం యోగా చేయడం ఎంతో ముఖ్యమని ప్రధాని మోదీ అనేకమార్లు వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ మన రోజువారీ జీవితాలను కుదిపేసింది. ఫలితంగా ఆరోగ్యంగా ఉండటానికి యోగా మరింత అవసరమైంది. ప్రజలు యోగాతో స్ఫూర్తిపొంది తమ జీవితాల్లో ఒక భాగం చేసుకుంటారని ఆశిస్తున్నా."