తెలంగాణ

telangana

ETV Bharat / international

'నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు'- బైడెన్​కు జిన్​పింగ్ డైరెక్ట్​ వార్నింగ్

తైవాన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అమెరికా (US China latest news) ప్రోత్సహించడాన్ని వ్యతిరేకిస్తూ అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​ను నేరుగా హెచ్చరించారు (Biden XI meeting) చైనా అధినేత జిన్​పింగ్. నిప్పుతో చెలగాటమాడుతున్నారని, అలా చేసే వారంతా భస్మమైపోతారని వ్యాఖ్యానించారు.

BIDEN jinping
BIDEN jinping meet

By

Published : Nov 16, 2021, 5:21 PM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో భేటీ అయిన (Biden XI meeting) చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్.. ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేశారు. ఇరుదేశాధినేతల మధ్య తొలిసారి జరిగిన వర్చువల్‌ చర్చలను జిన్‌పింగ్‌ (Biden XI meeting) బలప్రదర్శనకు బాగా వాడుకొన్నారు. తైవాన్‌ స్వాతంత్ర్య ఉద్యమాన్ని (US Taiwan China) అమెరికన్లు ప్రోత్సహించడమంటే నిప్పుతో చెలగాటమాడుకొన్నట్లే అని బైడెన్‌ను నేరుగా హెచ్చరించారు.

జో బైడెన్‌ అధికారంలోకి వచ్చాక షీ జిన్‌పింగ్‌తో వర్చువల్‌గా జరిగిన కీలక భేటీ ఇదే. తొలుత ఇద్దరు వ్యక్తిగత సంబంధాలను గుర్తు తెచ్చుకొన్నారని చైనా మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది. అనంతరం ఇరు దేశాల మధ్య అత్యంత కీలకమైన వివాదాన్ని ప్రస్తావనకు తెచ్చినట్లు పేర్కొంది. సమావేశం సందర్భంగా షీ జిన్‌పింగ్‌ తైవాన్ అంశంపై (Xi Jinping Taiwan reunification) మాట్లాడారని తెలిపింది.

"తైవాన్‌ కోసం అక్కడి అధికారులు తరచూ అమెరికాను మద్దతు కోరడం.. ఇదే సమయంలో అమెరికాలో కొందరు చైనాను దెబ్బతీయడం కోసం తైవాన్‌ను వాడుకోవాలనుకోవడం వంటి చర్యలు అత్యంత ప్రమాదకరమైనవి. నిప్పుతో చెలగాటమాడుకోవడం లాంటివే. నిప్పుతో ఎవరైతే చెలగాటం ఆడుకుంటారో.. వారు భస్మం కావడం ఖాయం"

-షీ జిన్​పింగ్

బైడెన్‌ మాత్రం జిన్‌పింగ్‌ ఆరోపణలను (Biden on Taiwan) తోసిపుచ్చారు. తాము యథాతథ పరిస్థితిలో మార్పులు తెచ్చేందుకు గానీ, తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలు సృష్టించడానికి వ్యతిరేకమని తెలిపారు.

ఒక్క తైవాన్‌ అంశంలో తప్ప మిగిలిన విషయాల్లో బైడెన్-జిన్​పింగ్ భేటీ సామరస్యపూర్వక వాతావరణంలో జరిగింది. ఇరు దేశాలు సమస్యలను సంయుక్తంగా పరిష్కరించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆంకాంక్షించారు.

గతంలో ట్రంప్‌ దెబ్బకు బెదిరిపోయిన జిన్‌పింగ్‌..!

అయితే, అమెరికా అధ్యక్షుడిని జిన్​పింగ్ నేరుగా హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. జిన్​పింగ్​ను హెచ్చరించిన సంగతి తెరమీదకు వస్తోంది.

ఆ సమయంలో ఏం జరిగింది..?

2017 ఏప్రిల్‌ నెలలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అమెరికాలో (Xi Jinping US visit) పర్యటించారు. నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఫ్లొరిడాలోని పామ్‌ బీచ్‌లో ఓ విలాసవంతమైన విడిది ఉంది. జిన్‌పింగ్‌కు అక్కడ ఆతిథ్యం ఇచ్చారు.

మరోపక్క సిరియాలోని బషర్‌ అల్‌ అసద్‌ సేనలకు వ్యతిరేకంగా అమెరికా సంకీర్ణ సేనలు పోరాడుతున్నాయి. రష్యా ప్రోత్సాహంతో చైనా నుంచి బషర్‌ సర్కారుకు సాయం అందుతోందన్న అనుమానాలు అమెరికాలో ఉన్నాయి. బషర్‌ అల్‌ అసద్‌పై తీసుకొస్తున్న ఐరాస తీర్మానాలను తరచూ రష్యాతో కలిసి చైనా అడ్డుకుంటోంది. దీనికి తోడు అసద్‌ విషవాయువులను సిరియాలోని సొంత ప్రజలపై ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో జిన్‌పింగ్‌ను హెచ్చరించడానికి డిన్నర్‌ను వాడుకొన్నారు.

క్షిపణులు ప్రయోగించాం..

ట్రంప్‌, జిన్‌పింగ్‌ భోజనం ముగించి చాక్లెట్‌ కేక్‌ తింటున్నారు. అదే సమయంలో ట్రంప్‌ నోటి నుంచి వచ్చిన మాటలకు జిన్‌పింగ్‌ అవాక్కయ్యారు. 'మిస్టర్‌ ప్రెసిడెంట్‌ మీకో విషయం చెబుతాను. ఇప్పుడే మేము 59 క్షిపణులను ప్రయోగించాం. అవి ఇరాక్‌ వైపు(పొరబాటున వచ్చిన మాట).. ఇప్పుడే సిరియావైపు వెళుతున్నాయి. మీకు ఆ విషయం తెలియాలి అనుకొంటున్నాను' అని అన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు 10 క్షణాలపాటు ఏమీ అర్థం కాలేదు. పక్కనే ఉన్న దుబాసీని పిలిచి ట్రంప్‌ ఏమన్నారో మరోసారి చెప్పమని కోరారు. అనంతరం దుబాసీ చెప్పింది విన్నారు.

అనంతరం జిన్‌పింగ్‌ స్పందిస్తూ.. 'మీరు చెప్పినట్లు గానీ, ఇంకా ఏ విధంగానైనాగానీ ఎవరైనా విషవాయువులను చిన్నపిల్లలు, పసికందులపై ప్రయోగించడం రాక్షసత్వం. ఇట్స్‌ ఓకే' అని జిన్‌పింగ్‌ స్పందించారు. డిన్నర్‌ ముగిసిన కొన్ని రోజుల్లోనే ఈ విషయాన్ని ట్రంప్‌ స్వయంగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడాన్ని చైనీయులు చాలా ఇబ్బందిగా ఫీలయ్యారు. మార్‌-ఎ-లాగో డిన్నర్‌ షీజిన్‌పింగ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ తర్వాత కూడా ట్రంప్‌ తన పదవీకాలం చివరి వరకు చైనాను ఇరుకునపెడుతూనే వచ్చారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details