తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​ ఫ్యాన్స్​ దెబ్బకు మోత మోగిపోయింది!

సాధారణంగా ఒకసారి ఏదైనా రాంగ్​ నంబర్​ నుంచి మనకు ఫోన్​ వస్తేనే విసుక్కుంటాం. మరి కొన్ని వందల ఫోన్లు వస్తే.. వస్తూనే ఉంటే..? ఊహించడానికే భయంకరంగా ఉంది కదూ..! అమెరికాలో ట్రంప్​ అభిమానుల దెబ్బకు ఓ వ్యక్తికి ఇదే పరిస్థితి ఎదురైంది.

Trump
ట్రంప్​ ఫ్యాన్స్​ దెబ్బకు మోత మోగిపోయింది!

By

Published : Jan 5, 2021, 5:15 PM IST

9848022338.. ఈ నంబర్​ ఎక్కడో విన్నట్టుంది కదా? ఓ సినిమాలో హీరో కోసం అభిమానులు ఈ నంబర్​కు వరుసపెట్టి ఫోన్​ చేసి కమేడియన్​ను ఓ ఆట ఆడుకుంటారు. అయితే ఉన్నట్టుండి దీని గురించి ఎందుకు అనుకుంటున్నారా? అమెరికాలో ఇదే సీన్​ రిపీట్​ అయింది. ట్రంప్​ అభిమానులు, మద్దతుదారులు ఓ వ్యక్తికి ఫోన్​ చేసి ఒక ఆట ఆడుకున్నారు.

అసలేమైందంటే..

మిషిగన్​ రాష్ట్రానికి చెందిన రోజ్​కు ఆదివారం ఓ కొత్త నంబర్​ నుంచి కాల్​ వచ్చింది. "మీరు ఎలాగైనా ట్రంప్​ను గెలిపించాలి.. ప్లీజ్​" అని ఎవరో చెప్తున్నారు. ఆశ్చర్యపోయిన రోజ్​.. "మీరు ఎవరనుకుని కాల్​ చేశారో.. రాంగ్​ నంబర్"​ అన్నారు. అయితే నిమిషాల్లోనే అలా కొన్ని వందల ఫోన్లు వచ్చాయి. అందరిదీ ఇదే మాట. "ట్రంప్​కు మీరు మద్దతు ఇవ్వండి", "బైడెన్​ ఎన్నికను చట్ట విరుద్ధమని ప్రకటించండి".. ఇలా ఏదేదో మాట్లాడుతున్నారు.

ఎంతమందికని చెప్తారు.. ఏమని చెప్తారు.. రోజ్​ బాధ వర్ణనాతీతం. నిల్చుంటే ఫోన్​, కూర్చుంటే ఫోన్​.. సోమవారం కూడా ఫోన్ రింగ్​ అవుతూనే ఉంది.

"అమెరికాలోని ప్రతి రాష్ట్రం నుంచి నాకు ఫోన్​ వచ్చింది. నా బాధ ఏమని చెప్పను? నేను మీరనుకున్న వ్యక్తిని కాను అని చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. వాళ్లు నాతో వాదిస్తున్నారు. ఒకరు నాకు మూడు సార్లు ఫోన్​ చేశారు. ప్రశాంతంగా సమాధానమిచ్చా.. అయినా వినడం లేదు."

- ఓ టీవీ ఛానల్ ఇంటర్వూలో రోజ్

ఎందుకిలా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రచార కమిటీ.. ఫేస్​బుక్​ పేజీలో చేసిన ఓ పొరపాటే ఇందుకు కారణం. అధ్యక్ష ఎన్నికల్లో మిషిగన్​ రాష్ట్రంలో జో బైడెన్​ విజయం సాధించిన విషయం అందరికీ తెలుసు. అయితే "రాష్ట్రంలో బైడెన్​ ఎన్నికను రద్దు చేయాలని మీరు డిమాండ్​ చేయండి" అంటూ ట్రంప్​ ప్రచార కమిటీ ఫేస్​బుక్​ పేజీలో ఓ పోస్ట్​ పెట్టింది. అందులో రిపబ్లికన్​ నేత ఛాట్​ఫీల్డ్​, సెనేట్​ మెజారిటీ నేత లీ షిర్కీ మెయిల్​, ఫోన్​ నంబర్లు ఉన్నాయి. అయితే అందులో ఛాట్​ఫీల్డ్​ నంబర్​ తప్పుగా ఉంది. ఆ నంబర్​ అదే రాష్ట్రానికి చెందిన రోజ్​ది అన్న మాట. ఇంకేముంది.. ట్రంప్​ అభిమానుల దెబ్బకు రోజ్ పనైపోయింది. ​ ​

ఇది తెలుసుకున్న రోజ్​.. ఈ విషయాన్ని ట్రంప్​ ప్రచార కమిటీకి చెప్పాలనుకున్నారు. అయితే దాన్ని కూడా ట్రంప్​ అభిమానులు ఓ నాటకమని.. అది ఛాట్​ఫీల్డ్​ నంబరే అని పోస్ట్​లు పెడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details